వరంగల్ గొర్రెకుంట బావి ఘటనలో ముగ్గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు!
- ఒకే బావిలో 9 మృతదేహాలు
- సంచలనం సృష్టించిన ఘటన
- కొనసాగుతున్న పోలీసు దర్యాప్తు
అటు, ఎంజీఎం ఆసుపత్రి నుంచి మృతదేహాల పోస్టుమార్టం నివేదిక వచ్చింది. అందరూ బావిలోనే ప్రాణాలు విడిచినట్టు ఆ నివేదికలో పేర్కొన్నారు. ఊపిరితిత్తుల్లోకి నీరు చేరడం వల్లే మృతి చెందినట్టు వెల్లడైంది. అయితే వారి ఉదర భాగాల నుంచి సేకరించిన నమూనాలను ఫోరెన్సిక్ విభాగం పరీక్షిస్తోంది. ఈ నివేదిక వస్తే, వారేమైనా విష ప్రభావానికి గురయ్యారా అనేది తేలనుంది.
ఈ ఘటనలో మొత్తం 9 మంది చనిపోగా, వారిలో ఏడుగురికి చెందిన సెల్ ఫోన్లు కనిపించకపోవడంతో ఆశ్చర్యం కలిగిస్తోంది. పోలీసుల్లో ఓ బృందం సెల్ ఫోన్ల కోసం గాలిస్తోంది. మక్సూద్, ఆయన కుమార్తె బుస్రా ఖాతూన్ ల ఫోన్ కాల్ డేటాను కూడా మరో పోలీసు బృందం పరిశీలిస్తోంది.