ఉత్తరకొరియా అధినేత కిమ్ ఇప్పుడేం చేస్తున్నారు?

24-05-2020 Sun 13:37
  • కిమ్ కనిపించడంలేదంటూ ఇటీవల కలకలం
  • ఎరువుల కర్మాగారం ఓపెనింగ్ లో కనిపించడంతో పుకార్లకు తెర
  • ఇటీవల మిలిటరీ కమిషన్ తో సమావేశాలు
  • అణు సామర్థ్యం పెంపుపై చర్చలు
What is doing Kim Jong Un now

ప్రపంచ దేశాల్లో కరోనా వ్యాప్తి మొదలయ్యాక ఉత్తర కొరియా దేశాధినేత కిమ్ జాంగ్ ఉన్ బహిరంగంగా కనిపించకపోవడం సంచలనం సృష్టించింది. కిమ్ ఆరోగ్య పరిస్థితి విషమించిందని వార్తలొచ్చాయి. చివరికి ఓ ఎరువుల కర్మాగారం ప్రారంభోత్సవంలో కిమ్ కనిపించడంతో వార్తలు సద్దుమణిగాయి. అయితే, యావత్ ప్రపంచం కరోనాతో అట్టుడికి పోతున్న వేళ కిమ్ ఏంచేస్తున్నాడన్నది అందరిలో ఓ సందేహం నెలకొంది. దీనిపై ఉత్తర కొరియా అధికారిక మీడియా కేసీఎన్ఏ ఆసక్తికర వివరాలు వెల్లడించింది.

తమ అణుశక్తిని మరింత పెంచుకునేందుకు కిమ్ జాంగ్ ఉన్ అనేక ప్రణాళికలు రచిస్తున్నట్టు కేసీఎన్ఏ తెలిపింది. కేసీఎన్ఏ కథనం ప్రకారం... కిమ్ ఇటీవల తరచుగా కేంద్ర మిలిటరీ కమిషన్ తో సమావేశాలు నిర్వహిస్తున్నారు. సైన్యాన్ని మరింత బలోపేతం చేయడం, మిలిటరీ ఎడ్యుకేషన్ సంస్థలను మరింత క్రియాశీలకంగా మార్చడం, వాటి పాత్రను పునర్నిర్వచించడంపై అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దేశ రక్షణ వ్యవస్థలో రాజకీయ, సైనిక లోటుపాట్లను గుర్తించి, పరిష్కార మార్గాలపై చర్చించారు. మిలిటరీ కమాండ్ వ్యవస్థ పునర్వ్యవస్థీకరణ దిశగా కిమ్ నిర్ణయం తీసుకున్నారు.