Vijay Sai Reddy: ప్రాణాంతక వైరస్ పై ఇది అసాధారణ విజయం: విజయసాయిరెడ్డి

Vijayasai Reddy explains how AP corona recovery rate better than national level
  • జాతీయస్థాయిలో కరోనా రికవరీ రేటు 40 శాతం
  • ఏపీలో 68 శాతం ఉందన్న విజయసాయి
  • సీఎం జగన్ చర్యలు, వైద్య సిబ్బంది కృషే కారణమని వెల్లడి
రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పందించారు. కరోనా రోగుల రికవరీ రేటు జాతీయస్థాయిలో 40 కంటే తక్కువే ఉందని తెలిపారు. ఏపీలో కరోనా నుంచి రోగులు కోలుకుంటున్న రేటు 68 శాతంగా నమోదైందని వెల్లడించారు.

అందుకు కారణం సీఎం జగన్ తీసుకుంటున్న ప్రత్యేక చర్యలు, వైద్య సిబ్బంది అత్యుత్తమ చికిత్స అందించడమేనని వివరించారు. ప్రాణాంతక వైరస్ పై ఇది అసాధారణ విజయం అని విజయసాయిరెడ్డి అభివర్ణించారు. కాగా, ఏపీలో ఇవాళ 29 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. తద్వారా మొత్తం 1807 మంది కరోనా నుంచి కోలుకున్నట్టయింది. ఇవాళ నమోదైన 66 కొత్త కేసులతో ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,627కి పెరిగింది.
Vijay Sai Reddy
Corona Virus
Recovery Rate
Andhra Pradesh
India
Jagan

More Telugu News