Jagan: జరిమానా రూ. 100 మాత్రమే... సీజ్ చేసిన వాహనాలపై జగన్ ఆదేశాలు!

YS Jagan orders 100 rupees fine for Seased vehicles
  • లాక్ డౌన్ సమయంలో భారీగా వాహనాల స్వాధీనం
  • మరో మారు అదే తప్పు చేయకుండా హామీ పత్రం
  • కరోనాపై అవగాహన కూడా కల్పించాలన్న వైఎస్ జగన్
లాక్ డౌన్ అమలులో ఉన్న వేళ, అవసరం లేకుండా రోడ్లపైకి వచ్చిన వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకోగా, వాటిని విడుదల చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశించింది. సీజ్ చేసిన వాహనాలను అన్నింటినీ విడుదల చేయాలని, జరిమానాగా రూ. 100 విధించాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పోలీసు శాఖను ఆదేశించారు.

వాహనాన్ని విడుదల చేసే సమయంలో మరోమారు అదే విధమైన తప్పు చేయబోమన్న హామీ పత్రాన్ని తీసుకోవాలని, కరోనా, లాక్ డౌన్ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వారికి అవగాహన కల్పించాలని జగన్ ఆదేశించారు.
Jagan
Lockdown
Vehicles
Sease
Fine

More Telugu News