44 ఏళ్ల కిందట మా పరిస్థితి ఇలా ఉండేది: బండ్ల గణేశ్ ఆసక్తికర వ్యాఖ్యలు
- వీడియో ట్వీట్ చేసిన బండ్ల గణేశ్
- ఓ వ్యక్తి సైకిల్ కు పూజ చేస్తున్న దృశ్యాలతో వీడియో
- లవ్యూ నాన్నా అంటూ తండ్రిని స్మరించుకున్న బండ్ల గణేశ్
44 ఏళ్ల క్రితం తాను, తన తండ్రి ఇలాంటి పరిస్థితుల్లోనే ఉన్నామని వెల్లడించారు. ఈ క్రమంలో బండ్ల గణేశ్ ఓ వీడియో పోస్టు చేశారు. అందులో ఓ వ్యక్తి సైకిల్ కు పూజ చేసి దండం పెడుతుండగా, పక్కనే ఓ చిన్నారి కేరింతలు కొడుతుండడం చూడొచ్చు. అంతేకాదు, నువ్వంటే ఎప్పటికీ ఇష్టం నాన్నా అంటూ బండ్ల గణేశ్ తండ్రిని స్మరించుకున్నారు.