Vuyyuru: పోలీస్ స్టేషన్ ఎదుట అనుచరులతో కలిసి ధర్నాకు దిగిన టీడీపీ ఎమ్మెల్సీ, మాజీ ఎమ్మెల్యే

Bode Prasad and Rajendra Prasad Dharna at Vuyyuru police station
  • ఉయ్యూరులో టీడీపీ కార్యకర్తపై పోలీసు కేసు నమోదు
  • అక్రమంగా మద్యం నిలవ చేశారని ఆరోపణ
  • తప్పుడు కేసులు బనాయిస్తున్నారంటూ టీడీపీ ఆందోళన
కృష్ణా జిల్లా ఉయ్యూరులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. స్థానిక పోలీస్ స్టేషన్ ఎదుట పార్టీ అనుచరులతో కలిసి టీడీపీ మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్, ఎమ్మెల్సీ బాబూ రాజేంద్రప్రసాద్ ఆందోళనకు దిగారు. వివరాల్లోకి వెళ్తే ఉయ్యూరు మండలం కాటూరు గ్రామంలో అక్రమంగా మద్యం నిలవ చేశారనే ఆరోపణలతో టీడీపీ కార్యకర్త రాంబాబుపై పోలీసులు కేసు నమోదు చేశారు.

ఈ నేపథ్యంలో, పోలీసుల తీరుపై టీడీపీ శ్రేణులు మండిపడ్డాయి. వైసీపీ నేతల ఒత్తిడితోనే తప్పుడు కేసులు బనాయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఉదయం ఉయ్యూరు రూరల్ పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించారు. పోలీసుల తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ నేపథ్యంలో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
Vuyyuru
TDP
Police Case
Protest

More Telugu News