అరచేతిని నరుక్కున్న యువకుడు.. పోలీసులకు అప్పగించిన గ్రామస్తులు!

23-05-2020 Sat 10:53
  • ఒడిశాలోని గంజాం జిల్లాలో ఘటన
  • అరచేతిని కవర్లో పెట్టుకుని ఊళ్లో తిరిగిన యువకుడు
  • ఆసుపత్రిలో చికిత్స
man arrests in odisha

ఓ యువకుడు తన అరచేతిని నరుక్కుని, అనంతరం దాన్ని ఓ కవర్‌లో పెట్టుకుని ఊరంతా తిరిగిన ఘటన ఒడిశాలోని గంజాం జిల్లా దిగపొహండి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. బి.తురుబుడి పంచాయతీ ప్రాంతానికి చెందిన నరేంద్రపూర్ (20) ఈ విచిత్ర ఘటనకు పాల్పడ్డాడు. నిన్న సాయంత్రం తమ ఇంటి పెరట్లోకి వెళ్లిన ఆ యువకుడు పదునైన ఆయుధంతో తన అరచేతిని నరుక్కుని, దానిని ఓ ప్లాసిక్ కవర్లో పెట్టుకుని గ్రామంలోని వీధుల్లో తిరిగాడు.

ఈ విషయాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఆ యువకుడిని, కవర్‌లోని అరచేతిని పోలీసులకు అప్పగించారు. ఆ యువకుడిని ఆసుపత్రికి తరలించిన పోలీసులు చికిత్స అందే ఏర్పాట్లు చేశారు. మానసిక సమస్యలతోనే అతడు ఈ ఘటనకు పాల్పడినట్లు సమాచారం.