Mahesh Babu: 'నీకన్నా నేనే పొడవుగా ఉన్నాను'.. మహేశ్ బాబు, కుమారుడు గౌతం ఫన్నీ వీడియో!

mahesh babu funny video
  • ఇంట్లో హైట్ చెక్‌ చేసుకున్న మహేశ్
  • చిరు నవ్వులు చిందించిన గౌతం
  • అభిమానులను అలరిస్తోన్న వీడియో
సినీనటుడు మహేశ్ బాబు, ఆయన కుమారుడు గౌతంలో ఎవరు పొడవుగా ఉంటారు. మహేశ్ బాబే కాస్త పొడవుగా ఉంటాడని తేలింది. కరోనా నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్‌తో ఇంట్లోనే ఉంటున్న మహేశ్ బాబు తన పిల్లలతో సరదాగా గడుపుతున్నాడు. తాజాగా తన కుమారుడి ముందు నిలబడి తమలో ఎవరు పొడవుగా ఉన్నారో చూసుకున్నాడు. ఆ సమయంలో గౌతం చిరునవ్వులు చిందించాడు. చివర్లో సితార కూడా అక్కడికి వచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియోను మహేశ్ బాబు తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో పోస్ట్ చేశాడు. 'హైట్‌ చెక్ చేసుకున్నాం' అని పేర్కొన్నాడు. అభిమానులను ఈ వీడియో అలరిస్తోంది.

              

Mahesh Babu
Tollywood
Instagram
Viral Videos

More Telugu News