'చారిత్రక విజయానికి ఏడాది' అంటూ వైసీపీ సంబరం!

22-05-2020 Fri 20:44
  • రేపటితో వైసీపీ విజయానికి ఏడాది పూర్తి
  • ట్విట్టర్ లో స్పందించిన వైసీపీ
  • విశ్వసనీయతకు పట్టం కట్టిన రోజంటూ జగన్ పై క్లిప్పింగ్స్
YSRCP selebrates first anniversary of their victory

ఏపీలో 2019లో జరిగిన అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో వైసీపీ తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శించిన సంగతి తెలిసిందే. అసెంబ్లీలో 151 స్థానాలు, లోక్ సభలో 22 సీట్లు గెలిచిన వైసీపీ చారిత్రాత్మక విజయం నమోదు చేసింది. ఇప్పుడా విజయానికి ఏడాది నిండిన సందర్భంగా వైసీపీ సోషల్ మీడియాలో సంబరాలకు తెరలేపింది.

సరిగ్గా గతేడాది మే 23న ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. రేపు మే 23 కావడంతో చారిత్రక విజయానికి ఏడాది అంటూ వైసీపీ ట్విట్టర్ లో పేర్కొంది. రాజన్న బిడ్డ, జనహృదయ నేత అంటూ సీఎం జగన్ ను కొనియాడింది. అంతేకాదు, విశ్వసనీయతకు పట్టం కట్టి రేపటికి ఏడాది అంటూ కొన్ని వీడియో క్లిపింగ్స్ ను కూడా పంచుకుంది.