ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎగ్జిక్యూటివ్ బోర్డ్ ఛైర్మన్ గా బాధ్యతలను స్వీకరించిన హర్షవర్ధన్

22-05-2020 Fri 19:46
  • జపానుకు చెందిన హిరోకి స్థానంలో బాధ్యతల స్వీకరణ
  • కరోనా సమయంలో బాధ్యతలను స్వీకరించానన్న హర్షవర్ధన్
  • రానున్న 20 ఏళ్లలో మరెన్నో సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుందని వ్యాఖ్య
Health Minister Harsh Vardhan Takes Charge As Chairman Of WHOs Executive Board

డబ్ల్యూహెచ్ఓ ఎగ్జిక్యూటివ్ బోర్డు ఛైర్మన్ గా కేంద్ర ఆరోగ్యమంత్రి హర్షవర్ధన్ ఈరోజు బాధ్యతలను స్వీకరించారు. జపాన్ కు చెందిన డాక్టర్ హిరోకి నకటాని స్థానంలో బాధ్యతలను చేపట్టారు.

ఈ సందర్భంగా హర్షవర్ధన్ మాట్లాడుతూ, ప్రపంచాన్ని కరోనా మహమ్మారి పీడిస్తున్న సమయంలో తాను ఈ బాధ్యతలను స్వీకరించాననే విషయం తనకు తెలుసని చెప్పారు. రానున్న రెండు దశాబ్దాల కాలంలో ప్రపంచాన్ని పలు ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టబోతున్నాయనే విషయం మనకు తెలుసని అన్నారు. ఈ సమస్యలను అందరం కలసికట్టుగా ఎదుర్కోవాలని చెప్పారు. హర్షవర్ధన్ ఈ పదవిలో మూడేళ్ల పాటు కొనసాగనున్నారు.