Marriage: పెళ్లికూతురుకు కరోనా... పెళ్లికొడుకు సహా అందరూ క్వారంటైన్ కు!

32 members sent to quarantine after bride tested corona positive
  • రెండు రోజుల క్రితం మధ్యప్రదేశ్ లో జరిగిన పెళ్లి
  • జ్వరంతో బాధపడుతున్న పెళ్లికూతురు
  • పరీక్షలు నిర్వహించగా కరోనా సోకినట్టు వెల్లడి
  • మొత్తం 32 మంది క్వారంటైన్ కు తరలింపు
కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో, విచిత్రమైన కేసులు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా పెళ్లి చేసుకున్న ఓ జంట కాపురానికి సిద్ధమవుతున్న వేళ... పెళ్లికూతురుకు కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో, వధూవరుల కుటుంబసభ్యులతో పాటు పెళ్లికి హాజరైన అందరిలో కలవరం మొదలైంది. ఈ ఘటన మధ్యప్రదేశ్ భోపాల్ సమీపంలోని జట్ ఖేడి ప్రాంతంలో చోటుచేసుకుంది.

రెండు రోజుల క్రితం ఈ వివాహం జరిగింది. లాక్ డౌన్ నిబంధనలకు లోబడే... అతి తక్కువ మంది బంధువులు, స్నేహితుల సమక్షంలో పెళ్లి తంతును ముగించారు. అయితే పెళ్లికూతురు అప్పటికే స్వల్ప జ్వరంతో బాధపడుతోంది. కాకపోతే మందులు వాడుతూ కాస్త హుషారుగానే కనిపించింది. ఆ తర్వాత జ్వరం కొంచెం ఎక్కువ కావడంతో హాస్పిటల్ కు తీసుకెళ్లారు. ఆమెకు పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్ గా తేలింది. దీంతో, ఆమెతో పాటు మొత్తం పెళ్లికి హాజరైన 32 మంది బంధువులను క్వారంటైన్ కు తరలించారు.
Marriage
Bride
Corona Virus
Quarantine Centre

More Telugu News