సీఎం కేసీఆర్ ను కలిసిన చిరంజీవి, రాజమౌళి, అల్లు అరవింద్

22-05-2020 Fri 17:29
  • లాక్ డౌన్ తో స్తంభించిపోయిన చిత్ర పరిశ్రమ
  • ఇప్పటికే తలసానితో చర్చించిన టాలీవుడ్ పెద్దలు
  • తాజాగా సీఎం కేసీఆర్ తో సమావేశం
Tollywood big heads meet CM KCR to discuss lock down problems

లాక్ డౌన్ కారణంగా సినీ పరిశ్రమ భారీగా నష్టపోయింది. టాలీవుడ్ లో వేల మంది కార్మికులు ఉపాధి కోల్పోయారు. పరోక్షంగా లక్షల మందిపై దీని ప్రభావం పడింది. దీనిపై సినీ ప్రముఖులు తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తో భేటీ అయిన సంగతి తెలిసిందే. తాజాగా, తమ ప్రతిపాదనల వివరాలను పంచుకునేందుకు టాలీవుడ్ పెద్దలు ప్రగతి భవన్ కు తరలివెళ్లారు. చిరంజీవి, నాగార్జున, రాజమౌళి, అల్లు అరవింద్, కొరటాల శివ, దిల్ రాజు, ఎన్.శంకర్, సి.కల్యాణ్ తదితరులు సీఎంతో సమావేశమయ్యారు. కాగా, చిత్ర పరిశ్రమకు లాక్ డౌన్ నుంచి మినహాయింపు ఇస్తే మున్ముందు తాము ఏ విధంగా భౌతికదూరం పాటిస్తూ షూటింగ్ లు జరుపుకుంటామో ఓ వీడియో రూపంలో సీఎం కేసీర్ కు ప్రదర్శించాలని సినీ ప్రముఖులు భావిస్తున్నట్టు తెలుస్తోంది.