పారితోషికంతో భయపెడుతున్న ప్రముఖ నటుడు!

22-05-2020 Fri 16:44
  • కీలక పాత్రలు పోషిస్తున్న సేతుపతి 
  • 'సైరా', 'ఉప్పెన' చిత్రాలలో కీలక పాత్రలు
  •  సినిమాకి పది కోట్ల డిమాండ్  
Vijay Setupati demands Ten crore for a film in Telugu

నో డౌట్.. విజయ్ సేతుపతి మంచి ఆర్టిస్టే!
అందుకే, ఆయనకి తెలుగు నుంచి కూడా ఆఫర్లు వెళుతున్నాయి. దీంతో అటు తమిళ చిత్రాలలో హీరోగా నటిస్తూనే, తెలుగులో మంచి కీలకమైన పాత్రలలో నటిస్తూ వస్తున్నాడు. ఆ విధంగా ఆమధ్య చిరంజీవి నటించిన 'సైరా' చిత్రంలో కీలక పాత్ర పోషించాడు. ఆ తర్వాత 'ఉప్పెన' సినిమాలో కూడా ముఖ్య పాత్ర పోషించాడు.

ఇలా తెలుగు నుంచి బోలెడు ఆఫర్లు వస్తుండడంతో విజయ్ సేతుపతి తన పారితోషికాన్ని భారీగా పెంచేశాడట. ప్రస్తుతం సినిమాకి 10 కోట్లు అడుగుతున్నట్టు టాలీవుడ్ లో చెప్పుకుంటున్నారు. అయితే, అతనికే అంత ఇస్తే ఇక బడ్జెట్టు విపరీతంగా పెరిగిపోతుందని ఆయా నిర్మాతలు భావిస్తున్నారట.

దాంతో చాలామంది నిర్మాతలు అతనిని బుక్ చేయడానికి వెనుకాడుతున్నట్టు తెలుస్తోంది. ఓ మాదిరి బడ్జెట్టు సినిమా నిర్మాతలే కాకుండా, స్టార్స్ తో నిర్మించే భారీ చిత్రాల నిర్మాతలు కూడా అంత మొత్తం ఇవ్వడానికి సుముఖంగా లేరని సమాచారం. మరి, ఇప్పుడైనా ఆయన పారితోషికాన్ని తగ్గించుకుంటాడేమో చూడాలి!