Unemployment: కరోనా ధాటికి అమెరికాలో నిరుద్యోగ సంక్షోభం... ఉద్యోగులను సాగనంపుతున్న కంపెనీలు!

Unemployment increases in USA due to corona outbreak
  • అమెరికాలో కరోనా దెబ్బకు ఆర్థిక వ్యవస్థకు విఘాతం
  • భారీగా ఉద్యోగాలను తొలగిస్తున్న కంపెనీలు, కార్యాలయాలు
  • ఇప్పటివరకు 3.9 కోట్ల మంది ఉద్యోగుల తొలగింపు
అమెరికన్లకే ఉద్యోగాలు, ఉపాధి కల్పన అనే అజెండాతో అధ్యక్ష పీఠం ఎక్కిన డొనాల్డ్ ట్రంప్ కు ప్రస్తుతం దేశంలో నెలకొన్న నిరుద్యోగ సంక్షోభం మింగుడుపడనిదే. కరోనా రక్కసి ప్రభావంతో దేశ ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా ప్రభావితమైన నేపథ్యంలో అనేక సంస్థలు భారీగా ఉద్యోగాల్లో కోత వేశాయి. దాని ఫలితమే ఇప్పటివరకు 3.9 కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోయారు. అమెరికాలోని అనేక ప్రాంతాల్లో లాక్ డౌన్ ఎత్తేస్తున్నా, నిరుద్యోగ సమస్య అంతకంతకు తీవ్రమవుతోంది.

కరోనా సంక్షోభంతో వాణిజ్య సంస్థలు, కార్యాలయాలు భారీగా ఉద్యోగులను తొలగించే ప్రక్రియ ఇప్పటికీ కొనసాగుతోంది. అమెరికా కార్మిక శాఖ వద్ద నమోదవుతున్న నిరుద్యోగల సంఖ్యే అందుకు నిదర్శనం. కరోనా సంక్షోభం మొదలయ్యాక అమెరికా కార్మిక శాఖ వద్ద 3.86 కోట్ల మంది నిరుద్యోగులుగా తమ పేర్లు నమోదు చేయించుకున్నారు. జూన్ నాటికి అమెరికాలో నిరుద్యోగ సమస్య గరిష్టంగా 25 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.
Unemployment
USA
Corona Virus
Unemployment Registration

More Telugu News