కోలుకుంటున్న జనసేన కార్యకర్త లోకేశ్ నాయుడు

22-05-2020 Fri 10:14
  • రెండు రోజుల క్రితం ఆత్మహత్యాయత్నం
  • పోలీసులు, ఎమ్మెల్యేపై ఆరోపణలు
  •  వేధింపులు భరించలేకే ఆత్మహత్యకు యత్నించానన్న లోకేశ్ నాయుడు
Jana Sena Activist Lokesh Naidu recovering

పోలీసులు తనను వేధిస్తున్నారంటూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన పశ్చిమగోదావరి జిల్లా తాడేప‌ల్లిగూడేనికి చెందిన జనసేన కార్యకర్త లోకేశ్ నాయుడు ఆసుపత్రిలో కోలుకుంటున్నాడు. ఏపీ నిట్‌లో కాంట్రాక్ట్ ఉద్యోగి అయిన లోకేశ్ నాయుడు  చేయని తప్పుకు కేసుపెట్టి పోలీసులు తనను వేధిస్తున్నారంటూ ఆత్మహత్యాయత్నం చేశాడు. ఇసుక లారీని అడ్డుకున్నందుకు పోలీసులు తనపై కేసు నమోదు చేశారని, ఉద్యోగం నుంచి తొలగించారని ఆరోపించాడు. పోలీసులతో పాటు తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే వేధింపులు తాళలేక బుధవారం పోలీస్ స్టేషన్‌లో ఆత్మహత్యకు యత్నించినట్టు నిన్న ఆసుపత్రిలో తెలిపాడు. కాగా, ప్రస్తుతం అతడు కోలుకుంటున్నట్టు వైద్యులు తెలిపారు.