భారత్‌లో ఒక్క రోజులో 6,088 మందికి కొత్తగా కరోనా

22-05-2020 Fri 09:25
  • మృతుల సంఖ్య మొత్తం 3,583 
  • మొత్తం కేసులు 1,18,447
  • 66,330 మందికి ఆసుపత్రుల్లో చికిత్స
  • కోలుకున్న 48,533 మంది
Total number of COVID19 cases in the country now at 118447

భారత్‌లో కొవిడ్‌-19 వైరస్ వ్యాప్తి, మరణాల సంఖ్య రోజురోజుకీ భారీగా పెరుగుతున్నాయి. ఒక్కరోజులో తొలిసారి 6,000 కంటే అధికంగా కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. గత 24 గంటల్లో దేశంలో 6,088 మందికి కొత్తగా కరోనా సోకింది.
                
దేశంలో కరోనా మృతుల సంఖ్య 3,583కి చేరింది. ఇక కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 1,18,447కి చేరింది. 66,330 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. 48,533 మంది కోలుకున్నారు.