Indiabulls: 2000 మందికి ఇండియా బుల్స్ ఉద్వాసన!

  • ఉద్యోగులను ఎడాపెడా తొలగిస్తున్న కంపెనీలు
  • ఆర్థిక సేవల రంగంలో ఇదే తొలిసారి
  • పూర్తి వేతనాన్ని వదులుకున్న కంపెనీ చైర్మన్
Indiabulls group sacks up to 2000 employees

కోవిడ్ లాక్‌డౌన్ కారణంగా ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయిన ప్రముఖ మార్ట్‌గేజ్ ఫైనాన్షియర్ ఇండియాబుల్స్ గ్రూపు 2 వేల మంది ఉద్యోగులను తొలగించింది. ఫలితంగా ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న ఇద్దరు వ్యక్తులు తెలిపారు.

లాక్‌డౌన్ కారణంగా ఆర్థికంగా ఒడిదొడుకులు ఎదుర్కొంటున్న పలు కంపెనీలు తమ ఉద్యోగులను పెద్ద ఎత్తున తొలగిస్తున్నాయి. కానీ, ఆర్థిక సేవల రంగంలో తొలగింపు ఇదే మొదటిది కావడం గమనార్హం. అయితే, ఇవి తొలగింపులు కావని, పనితీరు ఆధారంగా ఏటా 10 నుంచి 15 శాతం మంది సంస్థ నుంచి వైదొలగుతుంటారని ఇండియాబుల్స్ తెలిపింది.

ఖర్చులను నియంత్రించే ప్రయత్నాల్లో భాగంగా 2021 ఆర్థిక సంవత్సరానికి 35 శాతం వేతన కోత తీసుకున్నట్లు ఇండియాబుల్స్ నెల రోజుల క్రితమే చెప్పింది. అంతలోనే ఏకంగా 2 వేల మంది ఉద్యోగులను తప్పించడం చర్చనీయాంశమైంది. కాగా కంపెనీ చైర్మన్ సమీర్ గెహ్లట్ ఈ ఆర్థిక సంవత్సరం మొత్తానికి వేతనాన్ని వదులుకోవాలని నిర్ణయం తీసుకోగా, 25 శాతం వేతనం మాత్రమే తీసుకోవాలని కంపెనీ వైస్ చైర్మన్ గగన్ బంగా నిర్ణయించారు.

More Telugu News