Manisha Koirala: నేపాల్ కు మద్దతు పలికిన మనీషా కొయిరాలా...అక్కడికే వెళ్లిపొమ్మంటూ నెటిజన్ల తిట్ల పురాణం!

Manisha Koirala Supports Nepal gets troling from netizens
  • భారత్ ప్రాంతాలు తమవేనంటున్న నేపాల్
  • కొత్త మ్యాప్ ను సమర్థిస్తూ మనీషా వ్యాఖ్యలు
  • మధ్యలో చైనా ప్రస్తావన చేయడంతో ట్రోలింగ్
ప్రముఖ సినీ నటి మనీషా కొయిరాలాపై ఇప్పుడు భారత నెటిజన్లు తీవ్రంగా మండిపడుతూ ఉన్నారు. ఇండియాలో అంతర్భాగమైన కాలాపాని, లింపియాధురా, లిపులేఖ్ ప్రాంతాలు తమవేనని పేర్కొంటూ పార్లమెంటులో తీర్మానాన్ని ఆమోదించిన నేపాల్, కొత్త మ్యాప్ ను కూడా విడుదల చేసిన సంగతి తెలిసిందే.

నేపాల్ నిర్ణయంపై భారత్ తీవ్ర అగ్రహాన్ని కూడా వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో, మనీషా ఓ ట్వీట్ చేస్తూ, "మన చిన్న దేశం గౌరవాన్ని నిలబెట్టారు. అందుకు ధన్యవాదాలు. భారత్, చైనా, నేపాల్ మధ్య శాంతియుతమైన, గౌరవప్రదమైన చర్చల కోసం ఎదురుచూస్తున్నాం" అంటూ ట్వీట్ చేసింది.

ఇంకే ముంది, నెటిజన్ల నుంచి తిట్ల వర్షం మొదలైంది. ఇండియాలో ఉంటూ, ఇండియాలో ఉపాధి పొందుతూ, ఇండియాకు వ్యతిరేకంగా ఉన్న మ్యాప్ ను సమర్థిస్తున్నావా? అంటూ ట్రోలింగ్ మొదలుపెట్టారు. ఇక, దివంగత కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ భర్త, మిజోరం మాజీ గవర్నర్ స్వరాజ్ కౌశల్ ఏకంగా మనీషాను టార్గెట్ చేస్తూ, పలు ప్రశ్నలు సంధించారు. మ్యాప్ ను సమర్థించడంపై ఆమెను తప్పుబట్టారు. తనకు మనీషా తండ్రి ప్రకాశ్ కొయిరాలాతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేశారు. నేపాల్ తో ఉన్న గొడవల మధ్యలోకి చైనా ప్రస్తావన ఎందుకు తీసుకొచ్చావంటూ మండిపడ్డారు.
Manisha Koirala
Nepal
India
China
Trooling

More Telugu News