Krishna River Board: త్వరలో కృష్ణా నదీ యాజమాన్య బోర్డు కీలక సమావేశం

  • తెలుగు రాష్ట్రాల మధ్య నదీ జలాల వివాదం
  • పోతిరెడ్డిపాడుపై ఏపీ సర్కారు జీవో జారీ
  • తీవ్రంగా వ్యతిరేకిస్తున్న తెలంగాణ
Krishna River Board will meet to discuss water issues between two states

ఏపీ, తెలంగాణ మధ్య నదీ జలాల వ్యవహారంలో మరోసారి వివాదం రాజుకుంది. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యం పెంచేందుకు ఏపీ సర్కారు జీవో నెం.203 జారీ చేయడం తెలంగాణ వర్గాలను ఆగ్రహావేశాలకు గురిచేసింది. ఈ వ్యవహారంపై స్పందించిన కృష్ణా నదీ యాజమాన్య బోర్డు త్వరలోనే కీలక సమావేశం నిర్వహించనుంది.

ఇరు రాష్ట్రాల మధ్య సయోధ్య కుదర్చడమే ఈ సమావేశం ప్రధాన అజెండా అని తెలుస్తోంది. ఈ సమావేశంలో... కృష్ణా నదిపై ఏపీ, తెలంగాణ ప్రాజెక్టుల డీపీఆర్ పై చర్చ జరగనుంది. రెండో దశ టెలిమెట్రీ అమలు, ఇతర అంశాలపైనా చర్చించనున్నారు. ఈ మేరకు ప్రతిపాదిత అజెండాను కృష్ణా నదీ యాజమాన్య బోర్డు రెండు తెలుగు రాష్ట్రాలకు పంపింది. ఇంకా ఏవైనా అంశాలు చర్చకు తీసుకురావాలని అనుకుంటే ఈ నెల 26 లోపు తమకు పంపించాలని బోర్డు కోరింది.

More Telugu News