Corona Virus: భారత్‌లో 1,12,359కి చేరిన కరోనా కేసులు

Coronavirus  Cases in india
షార్ట్స్‌లో చూడండి
భారత్‌లో కొవిడ్‌-19 వైరస్ వ్యాప్తి, మరణాల సంఖ్య అంతకంతకూ పెరుగుతున్నాయి. ఒక్కరోజులో మరోసారి 5,000 కంటే అధికంగా కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. గత 24 గంటల్లో దేశంలో 5,609 మందికి కొత్తగా కరోనా సోకింది.

గత 24 గంటల్లో భారత్‌లో 132 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలో కరోనా మృతుల సంఖ్య మొత్తం 3,435కి చేరింది. ఇక కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 1,12,359కి చేరింది. 63,624 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది.
Go Back to Shorts
Corona Virus
COVID-19
India

More Telugu News