నేను చేసే ట్వీట్లకు నాదే బాధ్యత: నాగబాబు

21-05-2020 Thu 09:02
  • జనసేన పార్టీకి సంబంధం లేదు
  • మా ఫ్యామిలీలోని వారికి కూడా
  • ట్విట్టర్ లో వెల్లడించిన నాగబాబు
Nagababu Says His Own Responsibility on tweets

రెండు రోజుల క్రితం తన సోషల్ మీడియా ఖాతాలో నాధూరాం గాడ్సే విషయమై సినీ నటుడు, మెగా బ్రదర్ నాగబాబు చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. వాటిపై ఆయన వివరణ కూడా ఇవ్వాల్సి వచ్చింది. తాజాగా మరో ట్వీట్ పెట్టిన ఆయన, తాను చేసే ట్వీట్లకు తనదే బాధ్యతని అన్నారు.

"నేను ఏమి ట్వీట్ చేసినా, అందులో ఏమున్నా, అది నా వ్యక్తిగత బాధ్యతే. జనసేన పార్టీకిగానీ, మా కుటుంబంలోని మరెవరికైనాగానీ నా అభిప్రాయాలతో ఎటువంటి ప్రమేయమూ లేదు" అని నాగబాబు వ్యాఖ్యానించారు.