Cyclone Amphan: విశాఖలో ముందుకొచ్చిన సముద్రం.. మళ్లీ వెనక్కి వెళ్లింది!

Sea in Visakhapatnam went back to same place
  • తుపాను నేపథ్యంలో ముందుకొచ్చిన సముద్రం
  • భీకర అలలతో తీర ప్రాంత వాసులను భయపెట్టిన వైనం
  • వెనక్కి వెళ్లడంతో ఊపిరి పీల్చుకున్న మత్స్యకారులు

ఎమ్‌ఫాన్ తుపాను కారణంగా ఇటీవల  విశాఖలో ముందుకొచ్చిన సముద్రం ఇప్పుడు వెనక్కి వెళ్లింది. ముందుకొచ్చిన సముద్రం కెరటాలతో విరుచుకుపడడంతో తీరప్రాంత వాసులు భయభ్రాంతులకు గురయ్యారు. అయితే, తుపాను నిన్న తీరం దాటిన నేపథ్యంలో సముద్రం వెనక్కి వెళ్లింది. దీంతో మత్స్యకారులు ఊపిరి పీల్చుకున్నారు. మరోవైపు, సముద్రం అల్లకల్లోలంగా మారడంతో లోపలి నుంచి రొయ్యలు తీరానికి కొట్టుకొచ్చాయి. దీంతో వాటిని ఏరుకునేందుకు మత్స్యకారులు పోటీపడ్డారు.

  • Loading...

More Telugu News