David Warner: ఎన్టీఆర్‌ సినిమాలోని 'పక్కా లోకల్' పాటకు డ్యాన్స్ చేసిన క్రికెటర్ వార్నర్ దంపతులు

David Warner Superb Dance For Jr NTR Pakka Local Song
షార్ట్స్‌లో చూడండి
అల వైకుంఠపురములో’ సినిమాలోని ‘బుట్టబొమ్మ’ పాటకు ఆస్ట్రేలియా క్రికెటర్, ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు కెప్టెన్ డేవిడ్ వార్నర్ తన భార్య క్యాండీస్ వార్నర్‌తో కలిసి డ్యాన్స్ చేసి అదరగొట్టగా ఆ వీడియో బాగా వైరల్ అయిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆయన పలు తెలుగు సినిమా పాటలకు డ్యాన్సులు చేశారు.

ఆ‌ దంపతులు ఇప్పుడు నేను పక్కా లోకల్ పాటకు డ్యాన్ చేశారు. ఎన్టీఆర్‌ నటించిన 'జనతా గ్యారేజ్‌' సినిమాలో 'పక్కా లోకల్‌.. నేను పక్కా లోకల్‌' అంటూ తారక్‌తో కలిసి కాజల్‌ అగర్వాల్‌ ఓ స్పెషల్‌ సాంగ్‌లో అదిరిపోయే స్టెప్పులు వేసింది. ఇప్పుడు డేవిడ్ వార్నర్ తన భార్య క్యాండీస్ వార్నర్‌తో కలిసి చేసిన ఈ డ్యాన్స్‌ తారక్ అభిమానులను అలరిస్తోంది. 'హ్యాపీ బర్త్‌ డే జూనియర్ ఎన్టీఆర్‌.. గ్రేట్ డే' అంటూ ఆయన ఎన్టీఆర్‌కు ఈ గిఫ్టును అందించారు.    

Go Back to Shorts
David Warner
Junior NTR
Tollywood
Crime News

More Telugu News