america: రోడ్డుపై బ్యాగ్‌ లో రూ.75 లక్షలు దొరికితే తిరిగిచ్చేసిన కుటుంబం

Virginia family out for drive finds nearly  million in middle of the road
  • అమెరికాలో ఘటన
  • టూర్‌కి వెళ్లిన కుటుంబం
  • పోలీసులకు సమాచారం ఇచ్చిన ఫ్యామిలీ
రోడ్డుపై రూ.75 లక్షలు దొరికితే వాటిని తిరిగి ఇచ్చేసింది ఓ కుటుంబం. అమెరికాలోని వర్జీనియాకు చెందిన డేవిడ్‌ కుటుంబం  ఇటీవల పిక్‌అప్‌ ట్రక్‌లో వెళ్లింది. కరోలైన్‌ కౌంటీకి కొంత దూరంలో గూచ్‌లాండ్‌ కౌంటీ వద్ద రోడ్డుపై వారికి ఓ‌ బ్యాగ్‌ కనిపించగా,  రోడ్డుకు అడ్డంగా ఉందని వారు ట్రక్‌ను ఆపేసి బ్యాగును తీసి తమ ట్రక్ వెనుక భాగంలో పెట్టుకున్నారు. అనంతరం మళ్లీ ప్రయాణం కొనసాగించారు.

కొంత దూరం వెళ్లాక వారికి మరో బ్యాగు కనిపించింది. దాన్ని కూడా ట్రక్‌ వెనకాల పడేసి, తమ టూర్‌ను కొనసాగించారు. సాయంత్రం ఇంటికి చేరుకున్న అనంతరం ఆ బ్యాగులను తెరిచి చూడగా అందులో పెద్ద మొత్తంలో డబ్బు కనపడడంతో ఆశ్చర్యపోయారు. ఆ డబ్బు గురించి వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో వారింటికి చేరుకున్న పోలీసులు రెండు బ్యాగుల్లో దాదాపు రూ.75 లక్షలు (1 మిలియన్‌ డాలర్లు) ఉన్నట్లు గుర్తించారు. ఆ డబ్బు ఎవరిదన్న విషయాన్ని గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
america
offbeat

More Telugu News