'నీకు రిటర్న్‌ గిఫ్ట్ ఇవ్వాల్సి ఉందని నాకు తెలుసు' అంటూ ఎన్టీఆర్‌తో కలసి దిగిన ఫొటోను పోస్ట్ చేసిన చెర్రీ

20-05-2020 Wed 12:43
  • నా ప్రియ సోదరుడు ఎన్టీఆర్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు
  • నీకు బెస్ట్ గిఫ్ట్ ఇస్తానని నేను ప్రామిస్‌ చేస్తున్నాను
  • మరిన్ని వేడుకలు ముందున్నాయి 
ram charan wishes ntr

సినీనటుడు జూనియర్ ఎన్టీఆర్‌ పుట్టినరోజు సందర్భంగా రామ్ చరణ్ ఓ ఫొటో పోస్ట్ చేస్తూ పలు వ్యాఖ్యలు చేశాడు. 'నా ప్రియ సోదరుడు ఎన్టీఆర్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు. నీకు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాల్సి ఉందని నాకు తెలుసు. నీకు బెస్ట్ గిఫ్ట్ ఇస్తానని నేను ప్రామిస్‌ చేస్తున్నాను. మరిన్ని వేడుకలు ముందున్నాయి' అని రామ్ చరణ్ ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశాడు.

కాగా, ఎన్టీఆర్, చరణ్ కలిసి నటిస్తోన్న ఆర్ఆర్‌ఆర్‌ సినిమా నుంచి ఇప్పటికే చెర్రీకి సంబంధించిన ఓ వీడియో, ఫస్ట్‌లుక్‌ విడుదలయ్యాయి. చెర్రీ పుట్టినరోజు సందర్భంగా తారక్ ఆ వీడియోను పోస్ట్ చేశాడు. అయితే, తారక్ పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్ లుక్‌, వీడియోలను ఆర్‌ఆర్‌ఆర్‌ విడుదల చేయలేదు.