Nabababu: దయచేసి అందరూ నన్ను అర్థం చేసుకోండి: నాగబాబు

Nagababu explains about his comments on Gadse
  • గాడ్సే నిజమైన దేశభక్తుడు అంటూ ట్వీట్ చేసిన నాగబాబు
  • విమర్శలు రావడంతో మరో ట్వీట్
  • గాడ్సే నేరాన్ని సమర్థించలేదని వివరణ
మహాత్మా గాంధీని చంపిన నాథూరామ్ గాడ్సేని నిజమైన దేశభక్తుడు అని మెగాబ్రదర్ నాగబాబు అభివర్ణించడం చాలామందిని ఆశ్చర్యానికి గురిచేసింది. నాడు గాడ్సే వాదనను ఏ మీడియా కూడా వెల్లడించలేకపోయిందంటూ సానుభూతి ప్రదర్శించారు. దాంతో విమర్శలు వచ్చాయి.

ఈ నేపథ్యంలో నాగబాబు మరో ట్వీట్ లో వివరణ ఇచ్చారు. దయచేసి అందరూ తనను అర్థం చేసుకోవాలని అన్నారు. తాను నాథూరామ్ గురించి చేసిన ట్వీట్ లో అతను చేసిన నేరాన్ని సమర్థించలేదని, అతని అభిప్రాయాలు ఏమిటో జనానికి తెలియాలని మాత్రమే అన్నానని వివరణ ఇచ్చారు. తనకు మహాత్మాగాంధీ అంటే చాలా గౌరవం అని అన్నారు. "వాస్తవానికి నన్ను విమర్శించే వాళ్లకన్నా నాకు ఆయనంటే చాలా గౌరవం" అని పేర్కొన్నారు.
Nabababu
Gadse
Gandhi
Twitter

More Telugu News