Corona Virus: తెలంగాణలో అంతకంతకు పెరుగుతున్న కరోనా కేసులు... ఇవాళ నలుగురి మృతి

corona cases in telangana increases
  • నేడు 42 కొత్త కేసులు
  • జీహెచ్ఎంసీ పరిధిలో 34 మందికి కరోనా పాజిటివ్
  • ముగ్గురు వృద్ధులు, ఒక మహిళ మృతి
కొన్నాళ్ల కిందట తెలంగాణలో రోజుకు వేళ్ల మీద లెక్కబెట్టగలిగేలా నమోదైన కరోనా కేసులు ఇప్పుడు నిత్యం పదుల సంఖ్యలో నమోదవుతున్నాయి. ఇవాళ 42 కరోనా పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. వాటిలో 34 కేసులు జీహెచ్ఎంసీ పరిధిలోనివి కాగా, మరో ఎనిమిది మంది వలస కార్మికులు కూడా ఇవాళ కరోనా నిర్ధారణ అయిన వారిలో ఉన్నారు.

కరోనా నుంచి కోలుకున్న 9 మంది నేడు డిశ్చార్జి అయ్యారు. అయితే, ఇవాళ ఒక్కరోజే నలుగురు మృతి చెందడం వైద్య, ఆరోగ్య వర్గాల్లో ఆందోళన కలిగిస్తోంది. చనిపోయినవారిలో ముగ్గురు వృద్ధులు కాగా, మరొకరు మహిళ. దాంతో మొత్తం మరణాల సంఖ్య 38కి చేరింది. అటు, రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1634కి పెరిగింది. ఇప్పటివరకు 1011 మంది డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం ఆసుపత్రుల్లో 585 మంది చికిత్స పొందుతున్నారు.
.
Corona Virus
Telangana

More Telugu News