కరోనాను మించిన వాటితోనే కలిసి జీవించాం... ఇదెంత భయ్యా!: మంచు మనోజ్

19-05-2020 Tue 21:21
  • కరోనా సంక్షోభంపై మనోజ్ లేఖ
  • కరోనాపై కంగారు వద్దని సూచన
  • అనేక దృష్టాంతాలను ప్రస్తావించిన మనోజ్
Manchu Manoj writes open letter on corona crisis

టాలీవుడ్ నటుడు మంచు మనోజ్ కరోనా సంక్షోభం నేపథ్యంలో ఓ లేఖ రాశారు. ఇప్పుడందరూ కరోనాతో కలిసి జీవించక తప్పదని అంటున్నారని, దీంట్లో కంగారుపడాల్సిందేమీ లేదని, కరోనాను మించిన వాటితోనే కలిసి జీవించామని అన్నారు. అందుకు తగిన దృష్టాంతాలను కూడా మనోజ్ తన లేఖలో వివరించారు. గోకుల్ చాట్ వద్ద బాంబు పెట్టినవాడు కూడా మనందరితో కలిసి తిరిగినవాడేనని, అంతటి క్రూరుడితోనే కలిసి తిరిగాం, ఈ కరోనా ఎంత భయ్యా అంటూ తనదైన శైలిలో స్పందించారు.

పెళ్లి బట్టలు కొనాలని వెళ్లి కారు పార్క్ చేస్తే పైనున్న ఫ్లైఓవర్ కుప్పకూలి మీదపడి చనిపోయారని, నీచమైన కాంట్రాక్టర్లు వేసిన బ్రిడ్జిలపైన సంతోషంగా తిరిగేస్తున్నామని, ఇంతకంటే కరోనా ఏమైనా ప్రమాదకరమా అని పేర్కొన్నారు. కోఠి ఉమెన్స్ కాలేజీకి వెళ్లే అమ్మాయిలు ఎంతోమంది కామ పిశాచుల కళ్లను దాటుకుంటూ వెళుతుంటారని, అలాంటి వాళ్లకు ఈ కరోనాను దాటి వెళ్లడం ఓ లెక్కా అంటూ వ్యాఖ్యానించారు. ఇలాంటివే మరికొన్ని అంశాలను కూడా మనోజ్ తన లేఖలో ప్రస్తావించారు.