భారీ ఆఫర్‌ ను సున్నితంగా తిరస్కరించిన అనసూయ

19-05-2020 Tue 17:35
  • అనసూయకు బిగ్ బాస్-4 ఆఫర్
  • భారీ మొత్తాన్ని ఆఫర్ చేసిన నిర్వాహకులు
  • బిజీ కారణంగా నో చెప్పిన అనసూయ
Anchor Anasuya rejects beg deal

యాంకర్ అనసూయ ఇటు బుల్లి తెరతో పాటు అటు సినీ పరిశ్రమలో కూడా ఫుల్ బిజీగా ఉంటోంది. వరుస సినిమా అవకాశాలు ఆమె తలుపు తడుతున్నాయి. తాగాజా అనసూయకు సంబంధించి మరో వార్త వినిపిస్తోంది. ఆమెకు బిగ్ బాస్-4 రియాల్టీ షో ఆఫర్ వచ్చిందని టాక్. ఇందుకోసం భారీ మొత్తాన్ని ఆఫర్ చేశారని చెబుతున్నారు. అయితే, భారీ ఆఫర్ ను కూడా అనసూయ తిరస్కరించిందట.

వరుస సినీ అవకాశాలు, టీవీ షోలతో బిజీగా ఉన్న తరుణంలో... అన్ని రోజులు బిగ్ బాస్ కు పరిమితం కావడం అనసూయకు ఇష్టం లేదట. దీనికి తోడు ఇంటికి కూడా దూరంగా ఉండాల్సి ఉంటుంది. భర్త, పిల్లలను విడిచి అన్ని రోజులు గడపడం కూడా కష్టమని భావించిన అనసూయ బిస్ బాస్ ఆఫర్ ను సున్నతంగా తిరస్కరించిందట. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా అయినా మధ్యలో తళుక్కుమంటుందేమో వేచి చూడాలి.