Krishna River Board: ఏపీ జల వనరుల శాఖకు కృష్ణా బోర్డు సభ్య కార్యదర్శి లేఖ

Krishna river board writes to AP irrigation department
  • ఏపీ, తెలంగాణ మధ్య జలవివాదం
  • ఏపీ ప్రాజెక్టుల నుంచి నీటి విడుదల ఆపాలన్న కృష్ణా బోర్డు
  • కేటాయింపుల కంటే ఎక్కువగా వాడారని వెల్లడి
ఏపీ, తెలంగాణ మధ్య నదీ జలాల అంశంలో మొదలైన వివాదం క్రమంగా ముదురుతోంది. తాజాగా ఏపీ జలవనరుల శాఖ ఈఎస్ సీకి కృష్ణా బోర్డు సభ్య కార్యదర్శి లేఖ రాశారు. సాగర్ కుడికాల్వ, హంద్రీనీవా, ముచ్చుమర్రి ఎత్తిపోతల నుంచి నీటి విడుదల ఆపాలంటూ ఆ లేఖలో కోరారు. మే నెల వరకు ఇచ్చిన కేటాయింపుల కంటే అధికంగా నీటిని వాడుకున్నారంటూ లేఖలో ఆరోపించారు. నీటి విడుదలకు సంబంధించిన ఉత్తర్వులను విధిగా పాటించాలని కృష్ణా బోర్డు స్పష్టం చేసింది. ఎలాంటి ఫిర్యాదులకు అవకాశం ఇవ్వని విధంగా వ్యవహరించాలని హితవు పలికింది.
Krishna River Board
Andhra Pradesh
Irrigation
Telangana
Water
Disputes

More Telugu News