శ్రీదేవి చిన్నకూతురు ఖుషీ కపూర్‌ భావోద్వేగభరిత వ్యాఖ్యలు

19-05-2020 Tue 12:22
  • నేనింకా 19 ఏళ్ల అమ్మాయినే
  • నన్ను కొందరు అకారణంగా విమర్శిస్తుంటారు
  • అమ్మలా, అక్కలా లేవని అంటుంటారు
  • విద్వేషపూరిత మాటలు వింటే బాధగా ఉంటుంది
khushi post on social media

దివంగత హీరోయిన్ శ్రీదేవి చిన్న కూతురు ఖుషీ కపూర్‌ తాజాగా సోషల్ మీడియాలో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలు తెలిపింది. తానింకా 19 ఏళ్ల అమ్మాయినేనని, ఇంకా ఎదుగుతున్నానని తెలిపింది. తనకే అర్హత లేకపోయినా కొందరు తనపై చాలా ప్రేమను కురిపిస్తుంటారని ఆమె చెప్పింది. తానింకా ఏమీ సాధించలేదని, ప్రజలను సంతోషపరిచే శక్తి తనకుంటే అప్పుడు ఈ ప్రశంసలకు ఓ అర్థముంటుందని పేర్కొంది. అయితే, మరోవైపు కొందరు మాత్రం తనను అకారణంగా విమర్శిస్తుంటారని ఆమె వాపోయింది.

అమ్మలా, అక్కలా లేవని వేలెత్తి చూపుతుంటారని, తనపై జోక్‌లు వేస్తుంటారని తెలిపింది. విద్వేషపూరిత వ్యాఖ్యలు వింటుంటే బాధగా ఉంటుందని ఖుషీ తెలిపింది. తనపై వస్తోన్న ఇటువంటి విమర్శలను ఎలా ఎదుర్కోవాలో అర్థం కాదని, తాను కూడా అందరిలాంటి అమ్మాయినేనన్న విషయాన్ని ప్రజలకు చెప్పాలనిపిస్తుందని వ్యాఖ్యానించారు.