cyclone: 'ఎమ్‌ పాన్' అత్యంత తీవ్ర తుపానుగా మారి తీరం దాటే అవకాశం: వాతావరణ కేంద్రం

Super Cyclone Amphan updates
  • పశ్చిమ, తూర్పు మధ్య బంగాళాఖాతంలో 'ఎమ్‌ పాన్' పెను తుపాను 
  • పారాదీప్‌కు దక్షిణ దిశగా 570 కిలోమీటర్ల దూరంలో తుపాను
  • రేపు  బెంగాల్‌-బంగ్లా తీరం హతియా దీవుల వద్ద తీరం దాటే అవకాశాలు
  • గంటకు 165 నుంచి 195 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే సూచనలు
పశ్చిమ, తూర్పు మధ్య బంగాళాఖాతంలో 'ఎమ్‌ పాన్' పెను తుపాను కొనసాగుతోంది. ‌గత ఆరు గంటల్లో 14 కిలోమీటర్ల వేగంతో ఉత్తర ఈశాన్య దిశగా అది పయనించింది. పారాదీప్‌కు దక్షిణ దిశగా 570 కిలోమీటర్ల దూరంలో, పశ్చిమ బెంగాల్‌లోని డిగాకు దక్షిణ నైరుతి దిశగా 720 కిలోమీటర్లకు దూరంలో కేంద్రీకృతమై ఉంది.

ఉత్తర ఈశాన్య దిశగా వాయవ్య బంగాళాఖాతం మీదుగా పయనిస్తోంది. రేపు మధ్యాహ్నం బెంగాల్‌-బంగ్లాదేశ్ తీరం హతియా దీవుల వద్ద తీరం దాటే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. అత్యంత తీవ్ర తుపానుగా మారి తీరం దాటే సూచనలు కనిపిస్తున్నాయని తెలిపారు. తుపాను తీరం దాటే సమయానికి గంటకు 165 నుంచి 195 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచవచ్చని వివరించారు.  
cyclone
amphan
India

More Telugu News