Kajal Agarwal: లాక్ డౌన్ లోనూ ముద్దుగుమ్మలకు ఆదాయమే!

Kajal and Thamanna earn a lot in lock down period
  • ఇన్ స్టాగ్రాంలో ప్రమోషనల్ పోస్టింగులు 
  • కాజల్ కు 14.5, తమన్నాకు 10.5 మిలియన్ల ఫాలోవర్లు 
  • ఒక్కో పోస్టింగుకి 5 లక్షల  చెల్లింపు
కష్టపడి ఒక స్థాయి ఇమేజ్ ను సంపాదించుకుంటే, ఆ తర్వాత ఆ ఇమేజే వాళ్లకు సంపాదించిపెడుతుంది. ఇది సినిమా తారలకు బాగా సూటవుతుంది. ముఖ్యంగా స్టార్ ఇమేజ్ సంపాదించుకున్న హీరోలు, హీరోయిన్ల విషయంలో మరీనూ. అందుకే ఈ లాక్ డౌన్ లో కూడా కొందరు హీరోయిన్లు ఖాళీగా ఉండకుండా సైడ్ ఇన్ కమ్ సంపాదిస్తున్నారు. కాజల్ తమన్నా, కృతి సనాన్ వంటి తారలు తమ ఇన్ స్టాగ్రాం అకౌంట్లలో కమర్షియల్ యాడ్స్ కు సంబంధించిన పోస్టింగులు పెడుతూ లక్షల్లో సంపాదిస్తున్నారు.

ఇన్ స్టాగ్రాంలో కాజల్ కు 14.5 మిలియన్ల ఫాలోవర్లు వుంటే, తమన్నాకు 10.5 మిలియన్ల ఫాలోవర్లు వున్నారు. దీంతో ఈ లాక్ డౌన్ సమయంలో తమ ఖాతాల ద్వారా ప్రమోషనల్ పోస్టింగులను పెడుతూ వీరు లక్షల్లో సంపాదిస్తున్నట్టు తెలుస్తోంది. మామూలుగా సినిమా తారలకున్న ఆదరణను బట్టి ఒక్కో పోస్టింగుకి 5 నుంచి 10 లక్షల వరకు ఆయా సంస్థలు చెల్లిస్తుంటాయి. ఈ క్రమంలో కాజల్, తమన్నాలకు ఒక్కో పోస్టింగుకి సుమారు ఐదు లక్షలు వస్తున్నట్టు ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు. అంటే ఇంట్లోనే ఖాళీగా వుండి కూడా ఈ ముద్దుగుమ్మలు లక్షల్లో సంపాదిస్తున్నారన్న మాట. చూశారా.. తాము సంపాదించుకున్న గ్లామరు, ఇమేజు వీళ్లకు ఎలా ఉపయోగపడుతోందో!  
Kajal Agarwal
Thamanna
Kruti Sanon
Instagrame

More Telugu News