Pakistan: పాకిస్థాన్‌లో దారుణం.. యువకుడితో సన్నిహితంగా మాట్లాడారని ఇద్దరు యువతుల దారుణ హత్య

Two girls shot dead by father in pakistan
  • పాకిస్థాన్‌లో మరోమారు వెలుగులోకి పరువు హత్యలు
  • అబ్బాయితో సన్నిహితంగా మాట్లాడడమే వారు చేసిన తప్పు
  • కుమారుడితో కలిసి కూతుళ్లను కాల్చి చంపిన తండ్రి
యువకుడితో చనువుగా మాట్లాడిన ఇద్దరు అమ్మాయిలు పరువు హత్యకు గురయ్యారు. పాకిస్థాన్‌లో జరిగిందీ ఘటన. 16, 18 ఏళ్ల వయసున్న అమ్మాయిలు ఇద్దరు ఓ యువకుడితో సరదాగా మాట్లాడతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. నిజానికీ వీడియో ఏడాది క్రితం నాటిదైనా తాజాగా వెలుగులోకి వచ్చింది. ఇది అటూఇటు తిరిగి అమ్మాయిల తల్లిదండ్రుల దృష్టికి వచ్చింది. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన తల్లిదండ్రులు గ్రామ శివారులోకి వారిని తీసుకెళ్లి దారుణంగా కాల్చి చంపారు.

స్థానికంగా ఈ ఘటన కలకలం రేపడంతో రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. టీనేజీ అమ్మాయిల తండ్రి, సోదరుడే ఈ ఘాతుకానికి పాల్పడినట్టు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. కాగా, వైరల్ అయిన ఈ వీడియోలో మరో యువతి కూడా కనిపించగా, ఆమె ప్రాణాలకు వచ్చిన ముప్పేమీ లేదని పోలీసులు తెలిపారు. అంతేకాదు, అమ్మాయిలతో మాట్లాడిన ఆ యువకుడికి కూడా రక్షణ కల్పించనున్నట్టు చెప్పారు.
Pakistan
Honour killing
teenage girls
Murder

More Telugu News