Legal Notice: బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీకి భార్య నుంచి విడాకుల నోటీసు!

Bollywood Actro Nawazuddeen Wife sent divorce Notice
  • ఈ-మెయిల్, వాట్సాప్ ద్వారా నోటీసులు
  • అలియా తరఫున కేసును స్వీకరించిన న్యాయవాది అభయ్
  • 2009లో అలియాను రెండో పెళ్లి చేసుకున్న నవాజుద్దీన్
విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్న బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ నుంచి విడాకులు కోరుతూ ఆయన భార్య అలియా లీగల్ నోటీసును పంపించారు. లాక్ డౌన్ కారణంగా ఈ-మెయిల్, వాట్సాప్ ద్వారా నోటీసులను పంపించామని, తనకు రావాల్సిన భరణం గురించి కూడా ఆమె ప్రస్తావించారని అలియా తరఫున కేసును స్వీకరించిన న్యాయవాది అభయ్ వెల్లడించారు. ఇవ్వాల్సిన భరణాన్ని ఇచ్చి, తనకు విడాకులు ఇవ్వాలని ఆమె కోరారని తెలిపారు.

కాగా, నవాజుద్దీన్ కుటుంబంపై తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయని, తామిచ్చిన లీగల్ నోటీసులకూ ఆయన స్పందించలేదని అభయ్ వ్యాఖ్యానించారు. అలియాతో నవాజుద్దీన్ వివాహం 2009లో జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు. గతంలో షీబా అనే యువతిని పెళ్లి చేసుకున్న నవాజుద్దీన్, ఆపై ఆమె నుంచి విడిపోయి అలియాను వివాహమాడారు.

ప్రస్తుతం నవాజుద్దీన్ హోమ్ క్వారంటైన్ లో ఉన్నారు. రంజాన్ సందర్భంగా తన కుటుంబంతో కలసివుండేందుకు ముంబయి నుంచి యూపీలోని బుధానాకు వెళ్లిన ఆయన్ను, క్వారంటైన్ లో ఉండాలని అధికారులు సూచించారు. ఇదే విషయాన్ని స్పష్టం చేసిన ఆయన, తాను ప్రస్తుతానికి ఎవరినీ కలిసే ప్రయత్నం చేయడం లేదని స్పష్టం చేయడం గమనార్హం.
Legal Notice
Aliya
Nawajuddeen

More Telugu News