సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

19-05-2020 Tue 07:33
  • శ్రుతి హాసన్ ఆర్థిక సమస్యలు  
  • వెబ్ సీరీస్ లోకి వస్తున్న పూరి
  • ఎన్టీఆర్ తదుపరి సినిమా అదే!
Shruti Hassan says she has financial problems

*  తనకూ ఆర్థిక సమస్యలు వున్నాయంటోంది కథానాయిక శ్రుతి హాసన్. 'అందరిలానే నాకూ ఆర్థిక ఇబ్బందులు వున్నాయి. గతంలో తీసుకున్న లోన్లు చెల్లించాలి. అయితే, ఎంత ఇబ్బంది వచ్చినా మా నాన్నను మాత్రం అడగను. అడిగితే ఆయన ఇస్తారు. కానీ, నా మనసు అంగీకరించదు. ఎవరి పైనా ఆధారపడి బతకకూడదన్నది నా అభిమతం' అని చెప్పింది శ్రుతి .  
*  ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ కూడా డిజిటల్ ప్రపంచంలోకి వస్తున్నాడు. భారీ ఎత్తున వెబ్ సీరీస్ నిర్మాణాన్ని ఆయన ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఈ విషయంలో స్క్రిప్టు పని పూర్తి చేస్తున్నట్టు చెబుతున్నారు.
*  ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రాన్ని చేస్తున్న జూనియర్ ఎన్టీఆర్ తన తదుపరి చిత్రాన్ని త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో చేయనున్నాడు. 'అయినను పోయి రావలె హస్తినకు' పేరిట దీనిని పాన్ ఇండియా ఫిలింగా తీయడానికి త్రివిక్రమ్ స్క్రిప్టును సిద్ధం చేస్తున్నాడు. ఈ లాక్ డౌన్ సమయంలో స్క్రిప్టు పని పూర్తవుతున్నట్టు చెబుతున్నారు. కాగా, ఈ సినిమా మరికొంత కాలం వాయిదా పడుతుందంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదనీ, తన తదుపరి చిత్రాన్ని త్రివిక్రమ్ తో చేయడానికే ఎన్టీఆర్ నిర్ణయించుకున్నాడనీ సమాచారం.