Telangana: రంగారెడ్డి జిల్లాలో దారుణం.. 13 ఏళ్ల బాలికను పెళ్లాడిన 37 ఏళ్ల వ్యక్తి!

37 Year old man marry 13 year old girl in Rangareddy dist
  • పెళ్లయి ఇద్దరు పిల్లలున్న వ్యక్తితో బాలిక వివాహం
  • విషయం బయటకు పొక్కడంతో నిందితుడి పరార్
  • ఐసీడీఎస్ అధికారుల పర్యవేక్షణలో బాలిక
రంగారెడ్డి జిల్లాలో జరిగిన ఓ దారుణ విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. 13 ఏళ్ల బాలికను 37 ఏళ్ల వ్యక్తికి ఇచ్చి వివాహం జరిపించిన విషయం బయటపడగా, బాలికను పెళ్లాడిన వ్యక్తి ప్రస్తుతం పరారీలో ఉన్నాడు.  పోలీసుల కథనం ప్రకారం.. రంగారెడ్డి జిల్లా ఫరూక్‌నగర్‌ మండలంలోని అయ్యవారిపల్లి గ్రామానికి చెందిన మల్లేశ్ షాద్‌నగర్‌లోని ఓ మద్యం దుకాణంలో పనిచేస్తుంటాడు. అతడికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. కొన్నాళ్ల క్రితం అతడి భార్య చనిపోయింది.

దీంతో రెండో పెళ్లి చేసుకోవాలని భావించిన మల్లేశ్.. అదే గ్రామానికి చెందిన 13 ఏళ్ల బాలికపై కన్నేశాడు. తన కుమార్తె కంటే ఐదేళ్లు మాత్రమే పెద్దదైన ఆమెను పెళ్లాడాలని భావించాడు. బాలిక తల్లితో అప్పటికే పరిచయం ఉండడంతో వారిపై ఒత్తిడి తెచ్చి ఈ నెల 15న బాలికను రహస్యంగా పెళ్లి చేసుకున్నాడు. తాజాగా విషయం వెలుగులోకి రావడంతో పోలీసులు, ఐసీడీఎస్, రెవెన్యూ అధికారులు గ్రామానికి చేరుకుని బాలిక, ఆమె కుటుం సభ్యులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. ప్రస్తుతం బాలిక ఐసీడీఎస్ అధికారుల పర్యవేక్షణలో ఉంది. విషయం తెలిసి పరారైన మల్లేశ్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.
Telangana
Ranga Reddy District
Girl
Marriage

More Telugu News