చట్టం కఠినంగా అమలైతే అత్యాచారాలు ఎందుకు జరుగుతాయి?: టీడీపీ నాయకురాలు అనిత

18-05-2020 Mon 15:06
  • పిల్లలందరికీ తాను మేనమామ అని చెప్పుకున్నారు
  • ఒకే రోజు రెండు అత్యాచారాలు జరిగాయి
  • దిశ చట్టం కఠినంగా అమలైతే ఇలా ఎందుకు జరుగుతుంది
TDP leader Anitha targets Jagan

ఏపీలో ఒకే రోజు ఇద్దరు బాలికలు అత్యాచారానికి గురైన నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్ పై టీడీపీ నాయకురాలు అనిత విమర్శలు కురిపించారు. రాష్ట్రంలోని పిల్లలందరికీ తాను మేనమామనని జగన్ చెప్పుకున్నారని... రాష్ట్రంలో ఒకే రోజు ఇద్దరు అమ్మాయిలపై అత్యాచారం జరిగిందని అన్నారు.

ఒకే రోజు రెండు అత్యాచారాలు జరిగాయంటే రాష్ట్రంలో పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో అర్థమవుతుందని చెప్పారు. దిశ చట్టం కఠినంగా అమలవుతుందని ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటోందని... చట్టం కఠినంగా అమలైతే అత్యాచారాలు ఎందుకు జరుగుతాయని ప్రశ్నించారు.