ఎమ్మెల్సీగా ప్రమాణస్వీకారం చేసిన మహారాష్ట్ర ముఖ్యమంత్రి

18-05-2020 Mon 14:30
  • గతేడాది ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉద్ధవ్ థాకరే
  • సీఎంగా కొనసాగాలంటే ఎమ్మెల్సీగా నెగ్గక తప్పని పరిస్థితి
  • ఎమ్మెల్సీగా ఎన్నికవడంతో ఊరట
Maharashtra CM takes oath as MLC

మహారాష్ట్రలో గతేడాది సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసి, ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఉద్ధవ్ థాకరే నేడు ఎమ్మెల్సీగా ప్రమాణస్వీకారం చేశారు. శాసనమండలిలో శివసేన చీఫ్ సభ్యుడిగా ప్రవేశించడం ఇదే తొలిసారి కాగా, శాసనమండలిలో అడుగుపెట్టిన థాకరే కుటుంబీకుల్లో ఉద్ధవ్ రెండో వ్యక్తి.

ఇంతకుముందు ఉద్ధవ్ కుమారుడు ఆదిత్య శాసనమండలిలో అడుగుపెట్టారు. కాగా, సీఎంగా కొనసాగాలంటే ఉద్ధవ్ థాకరే ఎమ్మెల్సీగా ఎన్నికవడం తప్పనిసరి అయిన పరిస్థితుల్లో ఆయన ఎన్నిక అఘాడీ ప్రభుత్వానికి, శివసేన పార్టీకి ఊరట కలిగించింది.