రేపు సాయంత్రం సీఎం కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ క్యాబినెట్ భేటీ

17-05-2020 Sun 21:37
  • లాక్ డౌన్ ను పొడిగించిన కేంద్రం
  • తాజా మార్గదర్శకాలు జారీ
  • రాష్ట్రంలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్న సీఎం కేసీఆర్
Telangana cabinet to meet tomorrow to discuss on new guidelines
లాక్ డౌన్ ను మరో రెండు వారాలు పొడిగిస్తూ, కేంద్రం సరికొత్త మార్గదర్శకాలు విడుదల చేసిన నేపథ్యంలో తెలంగాణ క్యాబినెట్ సమావేశం కానుంది. రేపు సాయంత్రం 5 గంటలకు సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్ లో రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. లాక్ డౌన్ పొడిగింపు, తాజా మార్గదర్శకాలపై క్యాబినెట్ భేటీలో చర్చించనున్నారు. రాష్ట్రంలో నిర్వహించాల్సిన వ్యూహంపై ఈ సమావేశంలో చర్చించి ఓ నిర్ణయం తీసుకుంటారు. అంతేకాదు, వ్యవసాయ రంగానికి సంబంధించిన పలు అంశాలపైనా చర్చించే అవకాశాలున్నాయి.