Ali: షూటింగ్ స్పాట్ లో ఎదురైన చేదు అనుభవాన్ని వెల్లడించిన అలీ

Comedian Ali reveals his early experience in cinema industry
  • బాలనటుడిగా చిత్ర రంగ ప్రవేశం చేసిన అలీ
  • దర్శకుడు, నిర్మాతలతో కలిసి భోజనం చేయబోయిన అలీ
  • అక్కడ్నించి పంపించివేసిన చిత్రబృందం
టాలీవుడ్ లో బాలనటుడిగా ప్రవేశించి, ఎన్నో కష్టాలు పడి కమెడియన్ గా, హీరోగా ఎదిగిన నటుడు అలీ. అగ్రశ్రేణి కమెడియన్ గా స్టార్ డమ్ అందుకున్న అలీ తొలినాళ్లలో ఎన్నో వ్యతిరేక అనుభవాలు ఎదుర్కొన్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర అంశాలు వెల్లడించారు. పిన్న వయసులోనే తాను ఇండస్ట్రీలో అడుగుపెట్టానని, 14 ఏళ్ల వయసులో ఓ షూటింగ్ స్పాట్ లో భోజనం చేయడానికి వెళ్లగా, అక్కడ తనకు ఎలాంటి అనుభవం ఎదురైందో చెప్పారు.

"ఆ షూటింగ్ స్పాట్ లో ఓ మెస్ ఏర్పాటు చేశారు. ఆ మెస్ లో నాలుగు సెక్షన్లు ఉండేవి. మొదటి సెక్షన్లో దర్శకుడు, నిర్మాత ఇతర ముఖ్యమైనవాళ్లు తినేవాళ్లు. రెండో సెక్షన్లో అసిస్టెంట్ డైరెక్టర్లు, ఇతర విభాగాల అసిస్టెంట్లు తినేవాళ్లు. ఇక మిగిలినవాళ్లందరూ మూడు, నాలుగు సెక్షన్లలో తినాలి. నాకు ఆ విషయం తెలియక నేరుగా మొదటి సెక్షన్ లోకి వెళ్లాను. అక్కడ కూర్చున్న వాడ్ని లేపి, నువ్వు ఇక్కడ కాదు వెళ్లు అని పంపించేశారు. మూడో సెక్షన్ కి వెళితే అక్కడా అదే అనుభవం ఎదురైంది. దాంతో నాలుగో సెక్షన్ కు వెళ్లి భోజనం చేయాల్సి వచ్చింది. కానీ, ఆ సమయంలో నాకు విపరీతమైన కసి ఏర్పడింది. మొదటి సెక్షన్ లో కూర్చుని భోజనం చేయాలంటే ఏంచేయాలని తీవ్రంగా ఆలోచించాను. టీనేజిలో ఉన్నాను కాబట్టి ఎంతో ఆవేశం, కోపం, కసి ఉంటాయి. ఇలాంటి అనుభవాలు నాకే కాదు, చాలామందికి జరిగాయి" అంటూ వివరించారు.
Ali
Comedian
Tollywood
Andhra Pradesh

More Telugu News