David Warner: ఈసారి ప్రభుదేవాను టార్గెట్ చేసిన వార్నర్!

David Warner makes another video
  • టిక్ టాక్ వీడియోలతో అలరిస్తున్న ఆసీస్ క్రికెటర్
  • తెలుగు సినిమా పాటలకు డ్యాన్సులు
  • తాజాగా ముక్కాలా ముకాబులా రీమిక్స్ పాటకు డ్యాన్స్

తెలుగు సినిమా పాటలకు తనదైన శైలిలో డ్యాన్స్ చేస్తూ అలరిస్తున్న ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ మరో వీడియో చేశాడు. లాక్ డౌన్ వేళ ఇంట్లోనే ఉంటున్న వార్నర్ టిక్ టాక్ వీడియోలతో అభిమానులను అలరిస్తున్నాడు. ఇప్పటివరకు అల్లు అర్జున్ పాటలకు డ్యాన్స్ చేసిన వార్నర్ ఈసారి ప్రభుదేవా పాటను ఎంచుకున్నాడు. ప్రేమికుడు చిత్రంలోని ముక్కాలా ముకాబులా అంటూ సాగే ఈ హుషారైన గీతానికి రీమిక్స్ రాగా, ఆ పాటకు తన భార్యతో కలిసి అంతే ఉత్సాహంగా స్టెప్పులేశాడు. అంతేకాదు, తమలో ఎవరు బాగా డ్యాన్స్ చేశారంటూ నెటిజన్లను ప్రశ్నించాడు.


  • Loading...

More Telugu News