RK Meena: డాక్టర్ సుధాకర్ అరెస్టుకు దారితీసిన పరిణామాలపై వివరణ ఇచ్చిన విశాఖ సీపీ

  • తీవ్ర కలకలం రేపిన డాక్టర్ సుధాకర్ వ్యవహారం
  • నడిరోడ్డుపై డాక్టర్ వర్సెస్ పోలీస్
  • గతంలో జరిగిన వ్యవహారాలతో ఈ ఘటనకు సంబంధంలేదన్న సీపీ
Vizag CP RK Meena talk with media

విశాఖపట్నంలో నిన్న డాక్టర్ సుధాకర్ వ్యవహారం తీవ్ర కలకలం రేపింది. ఆయన వంటిపై చొక్కాలేని స్థితిలో, పోలీసులు చుట్టుముట్టి ఉండగా, చేతులు వెనక్కి విరిచి కట్టేసిన స్థితిలో కనిపించారు. దీనిపై అప్పుడే వివరణ ఇచ్చిన విశాఖ సీపీ ఆర్కే మీనా మరోసారి మీడియాకు వివరాలు వెల్లడించారు. ఘటనాస్థలిలో ఓ పౌరుడితో వైద్యుడు దురుసుగా ప్రవర్తించినట్టు తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. ఘటనపై సమాచారం అందుకుని అక్కడికి వెళ్లిన పోలీసులకు ఆయనెవరో కూడా తెలియదని, గతంలో జరిగిన సంఘటనలకు ఈ వ్యవహారానికి సంబంధంలేదని ఆర్కే మీనా స్పష్టం చేశారు.

ఆ డాక్టర్ తాగివున్నట్టు ట్రాఫిక్ పోలీసులు గుర్తించారని వెల్లడించారు. ఆ డాక్టర్ ను ఇంటికి పంపించేందుకు పోలీసులు యత్నించారని, వీడియోలో చూస్తే ఆ డాక్టర్ ప్రవర్తన ఎలా ఉందో అర్థమవుతుందని తెలిపారు. తమ సిబ్బంది ఎంతో ఓపికతో వ్యవహరించారని వివరించారు. డాక్టర్ సుధాకర్ ను కేజీహెచ్ కు తరలించామని చెప్పారు. కాగా, డాక్టర్ సుధాకర్ ను గతంలో మాస్కు అడిగినందుకు సస్పెండ్ చేశారంటూ మీడియాలో కథనాలు వచ్చాయి. దీనిపై రాజకీయంగానూ దుమారం రేగింది.

More Telugu News