David Warner: 'మైండ్ బ్లాక్' పాటకు డ్యాన్స్ చేయాలని కోరిన అభిమాని... ఆ పాట అందుబాటులో లేదన్న వార్నర్

Fan requests Warner for Mind Block song as the cricketer responded
షార్ట్స్‌లో చూడండి
ఆస్ట్రేలియా డైనమిక్ బ్యాట్స్ మన్ డేవిడ్ వార్నర్ ఇటీవల తెలుగు పాటలు, డైలాగులపై విపరీతమైన మోజు ప్రదర్శిస్తున్నాడు. హిట్ సాంగ్స్, పాప్యులర్ తెలుగు డైలాగులతో టిక్ టాక్ వీడియోలు చేస్తూ అలరిస్తున్నాడు.

ఈ నేపథ్యంలో ఓ అభిమాని మహేశ్ బాబు నటించిన 'సరిలేరు నీకెవ్వరు' చిత్రంలోని 'మైండ్ బ్లాక్' పాటకు డ్యాన్స్ చేయాలంటూ వార్నర్ ను కోరాడు. 'మైండ్ బ్లాక్' పాటకు డ్యాన్స్ చేయాలని, ఆ వీడియో కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నామని తెలిపాడు. దీనికి వార్నర్ స్పందించాడు. "హేయ్, ఈ పాటకు నేను డ్యాన్స్ చేయలేను. ఎందుకంటే ఈ పాటను ఆస్ట్రేలియాలో ఉపయోగించుకునే అవకాశం లేదు. ఈ పాటతో వీడియో చేసేందుకు అవకాశం లభిస్తే తప్పకుండా చేస్తాను" అంటూ ట్విట్టర్ లో బదులిచ్చాడు.
Go Back to Shorts
David Warner
Mind Block
Video
TikTok
Cricket
Tollywood

More Telugu News