Krishna Waters: కృష్ణా జలాల వినియోగంపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం!

  • జూరాల వద్ద మరో ప్రాజెక్టు
  • సాధ్యాసాధ్యాలు పరిశీలించాలని సీఎం ఆదేశాలు!
  • ముంపు ప్రాంతాలు లేని రీతిలో భారీ రిజర్వాయర్ కు సన్నాహాలు
Telangana government mulls to build another project

తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల అంశం ఇప్పటికే వివాదాస్పదమైన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. కృష్ణా జలాల వినియోగంపై కసరత్తు చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం జూరాల వద్ద మరో లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు నిర్మాణానికి సన్నాహాలు చేస్తోంది. ఈ ప్రాజెక్టు సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని  సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. జూరాల ప్రాజెక్టు సమీపంలో 15 నుంచి 20 టీఎంసీల సామర్థ్యం కలిగిన రిజర్వాయర్ నిర్మాణంపై తెలంగాణ సర్కారు నివేదిక కోరింది.

నీటిపారుదల అంశాలపై తాజాగా జరుగుతున్న సమీక్షలో ఈ ప్రాజెక్టుపై చర్చించే అవకాశం ఉంది. ఇప్పటికే థరూర్ మండలం గూడెం దొడ్డి, ద్యాగాదొడ్డి గ్రామాల నడుమ కొత్త ప్రాజెక్టుకు అనువైన ప్రదేశం ఉన్నట్టు నీటిపారుదల శాఖ తన నివేదికలో పేర్కొంది. నూతన రిజర్వాయర్ నుంచి నెట్టంపాడు, భీమా-1, భీమా-2, కోయిల్ సాగర్ కు లింక్ ఏర్పాటు చేసి 30 రోజుల్లోనే 15 నుంచి 20 టీఎంసీలు ఎత్తిపోసేలా ప్రాజెక్టుకు రూపకల్పన చేసినట్టు తెలుస్తోంది. ప్రధానంగా ముంపు ప్రాంతాలు లేనివిధంగా భారీ రిజర్వాయర్ నిర్మించనున్నట్టు తెలుస్తోంది.

More Telugu News