Kanna Lakshminarayana: ఏపీ సీఎం జగన్ కు మళ్లీ లేఖ రాసిన కన్నా

AP BJP Chief Kanna Lakshminarayana writes to CM Jagan
  • మే 6న ఓ లేఖ రాసిన కన్నా
  • తన లేఖను పట్టించుకోలేదంటూ తాజాగా మరో లేఖ
  • వలస కార్మికుల అంశంలో సీఎం జోక్యం చేసుకోవాలంటూ విజ్ఞప్తి
రాష్ట్ర బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ సీఎం జగన్ కు మరోసారి లేఖాస్త్రం సంధించారు. వలస కార్మికుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరి సరికాదని తెలిపారు. ఈ నెల 6న రాసిన లేఖలో వలస కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరినా ఫలితం లేదని ఆరోపించారు.

మహిళలు, చిన్నారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, సీఎం జోక్యం చేసుకుని వలస కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరారు. రాష్ట్రంలోని రోడ్లపై నడుచుకుంటూ, సైకిళ్లపై వెళుతున్న వలస కార్మికులు ఎక్కడ కనిపించినా బస్సుల ద్వారా రాష్ట్ర సరిహద్దుల వద్దకు చేర్చాలని సీఎం జగన్ ఆదేశించిన సంగతి తెలిసిందే.
Kanna Lakshminarayana
Jagan
Letter
Migrants
Lockdown
Corona Virus

More Telugu News