Liquor: తెలంగాణ నుంచి ఏపీకి అక్రమ మద్యం.. పుచ్చకాయల మాటున తరలింపు!

Liquor illegal trasportation from Telangana to AP
  • గుంటూరు జిల్లా పొందుగుల చెక్ పోస్టు వద్ద పట్టుబడిన మద్యం
  • మూడు వాహనాల్లో 2630 సీసాల అక్రమ రవాణా
  • ముగ్గుర్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు
ఏపీలో మద్యం ధరలు విపరీతంగా పెరగడం, సరైన బ్రాండ్లు అందుబాటులో లేకపోవడంతో... అక్రమ మద్యం అమ్మకాలకు రెక్కలొచ్చాయి. తెలంగాణ నుంచి ఏపీకి మద్యాన్ని అక్రమంగా తరలిస్తున్నారు. గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం పొందుగుల చెక్ పోస్టు వద్ద పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో 2630 మద్యం సీసాలు పట్టుబడ్డాయి.

పుచ్చకాయల మాటున మూడు వాహనాల్లో వీటిని తరలిస్తున్నారు. పట్టుబడిన మద్యం విలువ రూ. 5 లక్షలు. ఈ ఘటనలో ముగ్గుర్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా గుంటూరు అడిషనల్ ఎస్పీ మాట్లాడుతూ, అక్రమంగా మద్యం తరలించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Liquor
Andhra Pradesh
Telangana
Smugling

More Telugu News