Corona Virus: ఏపీలో మరో 48 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ

coronavirus cases in ap
షార్ట్స్‌లో చూడండి
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసుల సంఖ్య మరింత పెరిగింది.  గత 24 గంటల్లో 9,628 శాంపిళ్లను పరీక్షించగా మరో 48 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయిందని ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది. అదే సమయంలో 101 మంది డిశ్చార్జ్‌ అయ్యారని తెలిపింది.

రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,205గా ఉందని తెలిపింది. ప్రస్తుతం ఆసుపత్రుల్లో 803 మంది చికిత్స పొందుతుండగా, ఇప్పటివరకు 1,353 మంది డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో కరోనాతో 24 గంటల్లో మరొకరు మృతి చెందారు. దీంతో ఇప్పటివరకు ఏపీలో మృతి చెందిన వారి సంఖ్య 49కి చేరింది.

రాష్ట్రంలో గత 24 గంటల్లో చిత్తూరులో 8, గుంటూరులో 9, కడపలో 1, కృష్ణా జిల్లాలో 7, కర్నూలు, నెల్లూరు జిల్లాల్లో 9, విశాఖపట్నంలో 4, పశ్చిమ గోదావరిలో 1 కేసు నమోదయ్యాయని ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్య శాఖ బులెటిన్‌లో తెలిపింది.
                     
జిల్లాల వారిగా కేసుల వివరాలు..
     
Go Back to Shorts
Corona Virus
COVID-19
Andhra Pradesh

More Telugu News