Donald Trump: కరోనా వ్యాప్తి నేపథ్యంలో భారత్‌పై కీలక వ్యాఖ్యలు చేసిన ట్రంప్.. వీడియో ఇదిగో

trump on corona virus
  • భారత్‌ చాలా గొప్ప దేశం
  • ఆ దేశ ప్రధాని మోదీ నాకు ఓ మంచి స్నేహితుడు
  • మా మిత్ర దేశం భారత్‌కు వెంటిలేటర్లను విరాళంగా ఇస్తాం
  • వ్యాక్సిన్ కోసం ఇరు దేశాలు కలిసి పనిచేస్తున్నాయి
కరోనా వ్యాప్తి నేపథ్యంలో భారత్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 'భారత్‌ చాలా గొప్ప దేశం. ఆ దేశ ప్రధాని మోదీ నాకు ఓ మంచి స్నేహితుడు. మేము భారత్‌తో కలిసి పని చేస్తున్నాం. అమెరికాలో భారతీయులు చాలా మంది ఉన్నారు. వ్యాక్సిన్‌ అభివృద్ధి చేయడానికి కూడా పనిచేస్తున్నారు. ఇక్కడ గొప్ప భారతీయ శాస్త్రవేత్తలు, పరిశోధకులు ఉన్నారు'  అని ఆయన వ్యాఖ్యానించారు.

'మా మిత్ర దేశం భారత్‌కు వెంటిలేటర్లను విరాళంగా ఇస్తాం. కరోనా విపత్కర సమయంలో భారత్‌కు, మోదీకి మద్దతుగా నిలుస్తాం. వ్యాక్సిన్ కోసం ఇరు దేశాలు కలిసి పనిచేస్తున్నాయి. కంటికి కనపడని శత్రువుని ఇరు దేశాలు కలిసి ఓడిస్తాయి' అని ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు.
Donald Trump
Corona Virus
India

More Telugu News