Hero Nikhil: ఆనందోత్సాహాల్లో తేలిపోతున్న హీరో నిఖిల్!

Hero Nikhil feels happy moments
  • డాక్టర్ పల్లవీ వర్మను పెళ్లాడిన నిఖిల్
  • ఈ రోజు కోసం ఎంతో ఎదురుచూశానన్న నిఖిల్
  • తనకు శుభాకాంక్షలు తెలిపినవాళ్లకు ధన్యవాదాలు
యువ హీరో నిఖిల్ ఓ ఇంటివాడైన సంగతి తెలిసిందే. తన ప్రేయసి పల్లవి వర్మను వేదమంత్రాల సాక్షిగా పెళ్లాడారు. లాక్ డౌన్ కారణంగా పెళ్లి వాయిదా పడడంతో ఓ దశలో నిరాశకు గురైన నిఖిల్ ఎట్టకేలకు తన మనసు దోచిన మగువ చేయందుకున్నారు. దీనిపై నిఖిల్ స్పందిస్తూ, తనకు శుభాకాంక్షలు చెప్పిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు.

తన జీవితంలో ఎంతో కాలం వేచిచూసిన క్షణాలు ఇన్నాళ్లకు వచ్చాయని, ఇప్పుడు తాను కూడా పెళ్లయిన వారి జాబితాలో చేరానని వెల్లడించారు. తన మనసు మేఘాల్లో తేలిపోతోందని పట్టరాని సంతోషం వ్యక్తం చేశారు. నిఖిల్ వివాహం గురువారం ఉదయం షామీర్ పేటలోని ఓ వ్యవసాయక్షేత్రంలో అతి కొద్దిమంది అతిథుల సమక్షంలో జరిగింది. నిఖిల్ పెళ్లాడిన పల్లవీ వర్మ ఓ వైద్యురాలు. గతంలో వీరికి సంబంధించిన ప్రపోజల్, ఎంగేజ్ మెంట్ ఫొటోలు వైరల్ అయ్యాయి.
Hero Nikhil
Wedding
Pallavi Varma
Tollywood
Lockdown
Corona Virus

More Telugu News